కావలసిన పదార్థాలు: బొరుగులు(మరమరాలు): 1/2kg
బంగాళదుంప తరుగు: 2cups
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
ఎండుమిరపకాయలు: 3
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి
సరిపడా పసుపు: చిటికెడు
పప్పుల పొడి: తగినంత
ఎండు కొబ్బరి తురుము: 2tsp
నిమ్మరసం: తగినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా వెడల్పాటి పాత్రలో నీటిని తీసుకుని శుభపరిచిన బొరుగులు అందులో వేయాలి.
2. వెంటనే బొరుగులు పిండి మరొక పాత్రలో వేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడిచేసి అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము వేసి వేయించాలి.
4. ఈ మిశ్రమానికి బొరుగులు కూడా చేర్చి బాగా కలపాలి. ఓ నిమిషం తరువాత స్టౌ మీద నుండి దించేసుకొని నిమ్మరసం పట్టించి తినేముందుగా పప్పుల పొడి చల్లి సర్వ్ చేయాలి అంతే ఉగ్గాణి రెడీ...
మరింత సమాచారం తెలుసుకోండి: